సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండలం లోని ఆరనియార్ నీటిమట్టం మంగళవారం సాయంత్రానికి 30 అడుగులకు చేరుకుంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 31 అడుగులు గాను, నీటి సామర్థ్యం 1. 85 టీఎంసీగా ఉంది. ప్రస్తుతం 30 అడుగులు, 1. 74 టీఎంసీకి చేరుకుంది. ప్రస్తుతం ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రధాన తూము కాలువల ద్వారా 70 క్యూసెక్కుల నీరు బయటకు పంట పొలాలకు వెళ్తాంది.