వరదయ్యపాలెం మండల వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ఓ మోస్తరు వర్షం కురిసింది. వర్షానికి గ్రామీణ ప్రాంతాల రోడ్లతోపాటు పట్టణ ప్రాంతాలు చిత్తడి, చిత్తడిగా మారాయి. గత వారం రోజుల్లో రోజు మార్చి రోజు వర్షం పడుతుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.