ఆంధ్ర - తెలంగాణలో రైల్వే అభివృద్ధి కోసం కృషి చేస్తామని దక్షిణ మధ్య రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ సిఎం రమేష్ అన్నారు. ఆదివారం రేణిగుంట రైల్వే స్టేషన్ కు స్టాండింగ్ కమిటీ చైర్మన్ సీఎం రమేష్, కమిటీ సభ్యులు చేరుకోగా వీరికి ఘనంగా స్వాగతం లభించింది. సీఎం రమేష్ మాట్లాడుతూ రైల్వేల అభివృద్ధి పై తిరుపతిలో సమావేశం ఏర్పాటు చేశామని ఆంధ్ర - తెలంగాణ రాష్ట్రంలో రైల్వే అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు.