పుంగనూరు పట్టణం బ్రాహ్మణవీధిలోని శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో 353వ ఆరాధనోత్సవాలు వైభవంగా నిర్వహించారు. బుధవారం ఉదయం స్వామివారికి పంచామృతాభిషేకం, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, అర్చన, పుష్పాలతో అలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. మహా మంగళహారతి, శ్రీపాదరాజ మఠం మరియు శ్రీ హరిహర బ్రాహ్మణ యువజన సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో భక్తులకు అన్న సంతర్పణ నిర్వహించారు.