యాదమరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఎర్రచేను గ్రామంలో శుక్రవారం ఫ్రైడే-డ్రై డే పై సిహెచ లక్ష్మీనారాయణ ప్రజలకు అవగాహన కల్పించారు. వర్షాలు విస్తారంగా కురుస్తున్నదని దీంతో దోమలు వ్యాపించి ప్రాణాంతకమైన జ్వరాలు బారిన పడే అవకాశం ఉంది. కనుక నివాస గృహాలతో పాటు వాటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. డ్రైడే పాటించాలని దానివల్ల మంచి నీటిలో పెరిగే దోమలను, వాటి లార్వాలను నిర్మూలించవచ్చు అన్నారు.