చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయ నిత్యాన్నదానానికి తవణంపల్లె మండలం మైనగుండ్లపల్లె వాస్తవ్యులు సుబ్రహ్మణ్యం రెడ్డి లక్ష రూపాయలు ఆలయ సూపరింటెండెంట్ కోదండపాణికి శనివారం అందజేశారు. దాత, కుటుంబ సభ్యులకు స్వామివారి దర్శనం కల్పించి, తీర్థప్రసాదాలు అందించారు. పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.