రాష్ట్రంలో జరుగుతున్న అమానవీయ ఘటనలపై ఏపీ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించిందని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు మంగళవారం పేర్కొన్నారు. చిత్తూరు పార్లమెంటు లో తాజాగా జరుగుతున్న హత్యలు, అత్యాచారాలపై చిత్తూరు ఎంపీ చిత్తూరు కలెక్టరేట్ లో మీడియాతో మాట్లాడారు. ఆధునిక ప్రపంచంలో రోజురోజుకూ హత్యలు, అత్యాచారాలు మితిమీరుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.