చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ దృష్టిలోపం దినోత్సవ అవగాహన ర్యాలీని జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ అర్పిత గురువారం ప్రారంభించారు. ఈనెల 1 నుంచి 31 వరకు అన్ని పాఠశాలలో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి అద్దాలు పంపిణీ చేస్తామన్నారు. ఇప్పటివరకు 534 పాఠశాలలో 41, 063 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి, 1869 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశామన్నారు.