మా భూములు ఆక్రమించడమే కాకుండా ప్రశ్నించి నందుకు మాపైనే అక్రమ కేసులు బనాయిస్తున్నారని తమకు న్యాయం చేయాలని ఓ రైతు కుటుంబం సబ్‌కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టింది. బుధవారం సబ్ కలెక్టరేట్ ఎదుట మదనపల్లె మండలం వేంపల్లె గ్రామానికి చెందిన రైతు అమర నారాయణ కుటుంబం పెట్రోల్ బాటిల్‌తో వచ్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అమరనారాయణ, ఆయన కుమారుడు శ్రీనివాసులు మాట్లాడుతూ వేంపల్లె గ్రామం బండకా డపల్లెకు చెందిన తమ భూమి, ఇంటి స్థలాన్ని ఇద్దరు వ్యక్తులు ఆక్రమించుకున్నారని ఐదేళ్లుగా ఈ వివాదంపై రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగకపోగా తాము ఫిర్యా దు చేసిన వ్యక్తులు తమ కుటుంబపైనే అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు పెట్టించారన్నారు.