కురబలకోట మండలం ముదివేడు కు చెందిన అశోక్ (33) ఆదివారం రాత్రి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సోమవారం ఎస్సై దిలీప్ కుమార్ తెలిపారు. కుటుంబ సభ్యులు అశోక్ ను మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సలహా మేరకు తిరుపతి రుయా ఆసుపత్రికి తీసుకెళ్ళినట్లు ఎస్సై తెలిపారు.