కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వార్డులోనూ అభివృద్ధి కార్యక్రమాలను త్వరలోనే చేపట్టనున్నట్లు కమిషనర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. వార్డ్ బాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం 18వ వార్డులో కమిషనర్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపడం జరిగిందని, త్వరలోనే ప్రణాళిక బద్ధంగా పనులు చేపడుతామని ఆయన పేర్కొన్నారు.