చిత్తూరు జిల్లా ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆదివారం ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్తూరు దర్గా సర్కిల్లోని బి. ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ, వక్స్ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ముస్లింలు పాల్గొన్నారు.