పాకాల మండలం పుదిపట్లబైలు గ్రామంలో గుంతల రహిత రహదారుల కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రోడ్లకు మరమ్మతులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం ప్రారంభించిందన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు, అధికారులు పాల్గొన్నారు.