చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 18వ తేదీ నుంచి 31 వరకు పశువుల నట్టల నివారణ మందును పంపిణీ చేస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ జేడీ ప్రభాకర్ నేడు తెలిపారు. 16వ తేదీ ప్రారంభం కావాల్సి ఉండగా భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు 18 నుంచి ప్రారంభిస్తున్నామన్నారు. ఇంటి వద్దకే సిబ్బంది వచ్చి మేకలు, గొర్రెలు, పశువులకు మందు అందజేస్తారన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.