కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు బాబు నగర్ కాలనీలో శిథిలావస్థలో ఉన్న పలు గృహాలను ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, టీడీపీ కుప్పం ఇన్ఛార్జ్ మునిరత్నం సోమవారం పరిశీలించారు. అల్పపీడన ధోరణితో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బాబు నగర్ లో పలు గృహాలు శిథిలావస్థకు చేరుకోగా వాటిని పరిశీలించారు.