వినుకొండ: సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేయాలి

71பார்த்தது
వినుకొండ: సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేయాలి
చిన్నారులకు వేసే వ్యాధి నిరోధక టీకాలను సక్రమంగా వేయాలని వైద్యాధికారి మన్యం రాధాకృష్ణ అన్నారు. మండలంలోని స్థానిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఆశాడే నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ రికార్డుల నిర్వహణలో సిబ్బంది అలసత్వం వహిస్తే శాఖా పరమైన చర్యలు తప్పవని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి రావిపూడి రమ్య, సూపర్వైజర్ ఏడుకొండలు, ఉమాదేవి, ఎమ్ఎల్ హెచ్ పీ లు, ఏఎన్ఎమ్స్, ఆశాలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி