పొన్నూరు పట్టణంలో ప్రసిద్ధి పురాతన దేవాలయం శ్రీ సుందరవల్లి రాజ్యలక్ష్మి శ్రీసాక్షి భావన్నారాయణ స్వామి దేవస్థానంలో శనివారం హైకోర్టు జడ్జి గోపాల కృష్ణారావు కుటుంబసమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు జడ్జి గోపాల కృష్ణారావుకు ఆలయ సిబ్బంది, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు అనంతరం తీర్థప్రసాదాలు అందించారు.