పొన్నూరు పట్టణంలోని 17 వార్డ్ సచివాలయాల పరిధిలో ఈనెల 22 నుండి 25 వరకు ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సచివాలయాల పరిధిలోని ప్రజలు ఆధార్ కార్డు లోని మార్పులు, చేర్పులు తదితర సమస్యలను ఆధార్ క్యాంపు కేంద్రాల ద్వారా పరిష్కరించుకోవచ్చని ఆయన సూచించారు. ఆధార్ క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.