చినగంజాం గ్రామంలో బుధవారం పల్లె పండుగ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పాల్గొని కోటి రూపాయల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత వైసిపి పాలనలో పల్లెలు చీకటిగా మారాయని అన్నారు. అభివృద్ధి తన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.