పల్నాడు జిల్లా నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న కానిస్టేబుల్ బాబును వీఆర్ కు పంపుతూ ఉన్నతాధికారులు ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల బైకుల దొంగతనం కేసులో ఓ వ్యక్తి వద్ద రూ. 5 లక్షలు లంచం అడిగినట్లు బాబుపై ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. విచారణ అనంతరం బాబుపై చర్యలు తీసుకున్నారు.