సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి: డీఎంహెచ్ఓ

54பார்த்தது
సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి: డీఎంహెచ్ఓ
సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ డాక్టర్‌ రవి అన్నారు. మంగళవారం విజయపురి సౌత్ మండలంలోని కొప్పునూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో వచ్చే వ్యాధులను దృష్టిలో ఉంచుకొని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులతో సిబ్బంది సఖ్యతతో మెలగాలని సూచించారు. అనంతరం వైద్యులకు పలు సూచనలు చేశారు.

தொடர்புடைய செய்தி