పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలోని పోలీస్ స్టేషన్ ను గురజాల డిఎస్పి బి. జగదీశ్ సోమవారం సాధారణ తనిఖీల్లో భాగంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సంబంధించిన పొలాల్లోని ట్రాన్స్ఫార్మర్లు చోరీ కేసులను ఛేదించడమే కాక వెల్దుర్తి మండల ప్రజల శాంతి భద్రతల దృశ్య అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తన విధిని నిర్వహించినందుకు గాను, ఎస్సై షేక్ సమందర్ వలిని అభినందించారు.