కూటమి ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి పెద్ద ఎత్తిన నిధులు కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. యడ్లపాడు మండలం వంకాయలపాడులో సోమవారం సీసీ రహదారులు, డ్రైనేజీల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. గ్రామాల్లో అవసరమైన రోడ్లు, డ్రైన్లతో పాటు అనేక విధాల అభివృద్ధి పనులకు సీఎం నిధులు అందిస్తున్నారన్నారు.