కొరిసపాడు మండలంలోని గొర్రెలు, మేకల పెంపకం దారులకు ఈనెల 15వ తేదీ నుంచి నట్టల మందు నివారణ పంపిణీ కార్యక్రమం జరుగుతుందని మండల పశువైద్య అధికారి డాక్టర్ వెంకట్రావు శనివారం తెలియజేశారు. తన సిబ్బంది నేరుగా రైతుల ఇంటి వద్దకు వచ్చి నట్టల మందు ను పంపిణీ చేస్తారని ఆయన చెప్పారు. ఈనెలఖరు వరకు పంపిణీ కార్యక్రమం ఉంటుందని డాక్టర్ వెంకట్రావు తెలియజేశారు.