అద్దంకి మండలం తిమ్మాయపాలెం సమీపంలో గుండ్లకమ్మ వంతెన పైనుండి విద్యార్థి నీటిలో దూకిన సంఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. అద్దంకి పట్టణానికి చెందిన శ్రీనివాసరావు కుమారుడు దుర్గాప్రసాద్ తన సోదరుడితో కలిసి ద్విచక్ర వాహనంపై తిమ్మాయపాలెం బయలుదేరారు. గుండ్లకమ్మ వంతెన దగ్గరకు రాగానే దుర్గాప్రసాద్ ఒకసారిగా బండి దిగి గుండ్ల కమ్మలోకి దూకాడు. ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.