చిట్వేలు: ఉద్యాన పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారులు
ఉద్యాన పంటలలో వర్షపు నీరు నిలువ లేకుండా కాలువలు తీసి బయటకు పంపించాలని మండల వ్యవసాయ శాఖ అధికారి సందీప్, ఉద్యాన శాఖ అధికారి ఆయేషా రైతులను కోరారు. బుధవారం తుఫాను కారణంగా పంటచేలలో నిలిచిన నీటిని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంట చేలో నీరు నిలువ ఉంటే వేరు కుళ్ళి పోవడం, పోషకాల లభ్యత తగ్గిపోయి మొక్కలు బలహీనంగా పెరుగుతాయి అన్నారు.