ఓబులవారి పల్లి మండలం మంగళంపల్లి గిరిజన కాలనీ వెంగయ్య, సుబ్బమ్మలకు 1996లో ప్రభుత్వ బంజరు భూమికి పట్టా ఇచ్చి, ఆన్లైన్ చేసి ఇవ్వగా, అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఆ భూములను ఆక్రమించారని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పండుగోల మణి తెలిపారు. కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని గురువారం రాజంపేట సబ్ కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. పంటలు పండే భూమిని దౌర్జనంగా ఆక్రమించారని ఆరోపించారు.