ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణంలోని అన్ని రకాల దుకాణాలను మంగళవారం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మూసివేయాలని రైల్వే కోడూరు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ నాయక్ తెలిపారు. 144 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున రైల్వే కోడూరు పట్టణంలో ర్యాలీలు నిర్వహించడం విజయోత్సవాలు చేయడం టపాసులు కాల్చడం నిషేధించామని ఆయన తెలిపారు.