పుల్లంపేటలో తుఫాను ప్రభావంతో గ్రామములోని మారమ్మ దేవస్థానం లోనికి నీరు చేరింది. గుడి వెనక వైపున ఉడుము వారి పల్లి రైతుల కొరకు ఏర్పాటుచేసిన కాలువలో చెత్త, మాంసము, చికెన్ దుకాణాల లోని వ్యర్థ పదార్థాలు వేయడం వలన కాల్వ పూడి పోయింది. వర్షానికి వచ్చిన నీరు ఇలా ఆలయంలోనికి చేరిపోయింది. ఇకనైనా అధికారులు స్పందించి కాలువలో పూడిక తీయించాలని ప్రజలు కోరుతున్నారు.