వేంపల్లెలోని చింతలమడుగుపల్లె గ్రామంలో గ్యాస్ లీకై రూ. 20 వేల ఆస్తి నష్టం జరిగింది. ఆదివారం సాయంత్రం గిరిధర్ రెడ్డి ఇంట్లో జరిగిన ఈ ఘటనలో మంటలు చెలరేగాయి. ఫైర్ ఇన్ ఛార్జ్ అధికారి వెంకటసుబ్బయ్య తెలిపిన వివరాల ప్రకారం, అక్కడ ఉన్న వంట సామగ్రి కాలిపోయింది. సమయానికి ఫైర్ సిబ్బంది అక్కడ చేరుకొని మంటలను ఆర్పారు.