వ్యవసాయంలో ఆధునిక పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాలని బద్వేలు సహాయ వ్యవసాయ డైరెక్టర్ ఎం నాగరాజు తెలిపారు. శనివారం బద్వేలు వ్యవసాయ డివిజన్ పరిధిలోని బద్వేలు, గోపవరం, అట్లూరు, సిద్ధవటం మండలాల వ్యవసాయ అధికారులు, రైతు సేవా కేంద్రాల వ్యవసాయ సహాయకులకు శిక్షణ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. ఖరీఫ్ సీజన్లో పంటల సాగు నమోదు, రబీలో వివిధ పంటల సాగు అవకాశాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు.