చెన్నూరు వద్ద ఉన్న పెన్నా నదికి భారీగా వరద నేటి ప్రవాహం పెరుగుతున్నది. బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా కడప, నంద్యాల జిల్లాలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురవడంతో కుందు నది, పాపాగ్ని, వక్కిలేరు చిన్నపాటి వంకలనుంచి పెన్నా నదిలోకి వరద నీరు చేరడంతో గురువారం సాయంత్రానికి చెన్నూరు వద్ద 38500 క్యూసెక్కులు వరద నీరు పెన్నా నది నుంచి దిగువ ఉన్న సోమశిల జలాశయంలోకి వరద నీరు ప్రవహిస్తున్నది.