యోగి వేమన విశ్వవిద్యాలయం ఎకనామిక్స్ ప్రొఫెసర్ బాయినేని శ్రీనివాసులు నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ (ఎన్. ఎ. ఎ. సి) పీర్ టీం ఛైర్మన్ గా నియమితులయ్యారు. ఈ బృందం కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం ఉన్న ప్రముఖ మహాత్మా గాంధీ డిగ్రీ కళాశాలను ఈ నెల 23, 24వ తేదీన సందర్శించనుంది. ఈ బృందానికి సమన్వయకర్తగా డాక్టర్ ఎన్ ఆర్ మోహన్ వ్యవహరించనున్నారు.