ఉరవకొండ మండల పరిధిలోని నింబగల్లు గ్రామంలో గురువారం పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీడీవో బివి రవి ప్రసాద్ 17 లక్షల రూపాయలకు సంబంధించి స్థానిక నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని గుర్తించి గ్రామాలలో మౌలిక వసతులు కల్పనకు శ్రీకారం చుట్టిందన్నారు.