మొదటిసారి వచ్చిన సీఐని కలుసుకొని నాయకులు, వివిధ సంఘాల నేతలు పుష్పగుచ్చాలు ఇవ్వడం, పూలమాలలు వేయడం, శాలువలు కప్పి సన్మానించడం ఆనవాయితీ. అయితే, ఉరవకొండ సర్కిల్‌కు రెండవసారి బాధ్యతలు స్వీకరించిన సీఐ చిన్న గౌస్‌కు గురువారం ఘన సత్కారాలు కొనసాగుతుండడం విశేషం. ఆయనను అభిమానంగా సన్మానించి కుల, మతాలకు అతీతంగా, అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య భేదభావాలు చూపకుండా ప్రజలు గొప్పగా సత్కరించారు.