ఉరవకొండలో గురువారం ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయ్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కోదండ రామి రెడ్డి విలేకరులతో మాట్లాడారు. వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు చాలా మంది అనారోగ్య రీత్యా వివిధ కారణాలతో మరణించడం జరిగిందన్నారు. రెండు దశాబ్దాల పాటు పని చేసిన వారి కుటుంబాల యజమాని మరణించిన తర్వాత, ప్రభుత్వం ఆదుకోవాలి అని డిమాండ్ చేశారు.