యల్లనూరు మండల కేంద్రంలో గురువారం మట్కా స్థావరాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. మండల కేంద్రంలో మట్కా నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎస్ఐ రాంప్రసాద్ తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. దాడుల్లో నాగేంద్ర శెట్టి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి రూ. 30, 200 నగదు, మట్కా చీటీలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.