పుట్లూరు మండల కేంద్రంలోని క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేయాలని యువకులు మండల అధికారులను కోరారు. సోమవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో అలివేలమ్మను కలిసి వినతి పత్రం అందజేశారు. జెడ్పీ పాఠశాల క్రీడా మైదానం పిచ్చి మొక్కలతో నిండి, బహిరంగ మలమూత్ర విసర్జన, మద్యం సేవించడం వంటి అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారన్నారు. మైదానాన్ని అభివృద్ధి చేస్తే యువకులకు ఎంతో ఉపయోగపడుతుందని కోరారు.