నార్పల మండల పరిధిలోని బొందలవాడ, నడిమి దొడ్డి గ్రామాల్లో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందుల బుధవారం పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని అనంతపురం సహాయ డైరెక్టర్ డాక్టర్ లక్ష్మి పర్యవేక్షణ చేశారు. ఆమె మాట్లాడుతూ. కార్యక్రమం ఈ నెల చివరి వరకు జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్క గ్రామంలో ఈ నెల చివరి లోపు అన్ని గొర్రెలకు మందులు తీసుకోవాలని కోరారు.