రాయలసీమ జిల్లాలలో శనగ పంట సాగుకు అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15వ తేది వరకు అనుకూలమని కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త చండ్రాయుడు శుక్రవారం విలేఖరులకు తెలిపారు. ఎన్. బి. ఈ. జి 452, 857, జెబి11 రకాల విత్తనాలు అధిక దిగుబడినిస్తుందని తెలిపారు. విత్తుకునే ముందు కిలో విత్తనానికి 3గ్రాముల కార్బెండజిమ్ విత్తన శుద్ధి చేసుకుంటే తెగుళ్లను నివారించవచ్చని సూచించారు.