పంట నమోదు ద్వారా సంక్షేమ పథకాలు

945பார்த்தது
పంట నమోదు ద్వారా సంక్షేమ పథకాలు
అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నం మండలం రైతుల సాగు చేసిన పంటలను పంట నమోదు చేసుకొని ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందవచ్చని మేజర్ పంచాయతీ సర్పంచ్ నాగలక్ష్మి రాజు, అగ్రి అడ్వైజరీ బోర్డు చైర్మన్ రమణారెడ్డి తెలిపారు.

సోమవారం మండల కేంద్రంలోని సర్పంచ్ అధ్యక్షతన  రైతు భరోసా యాత్ర లో భాగంగా రైతు భరోసా కేంద్రం నందు రైతులకు వివిధ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ శాఖ అనుబంధంతో ఏర్పడిన రైతు భరోసా కేంద్రం నందు వివిధ  శాఖలఅధికారుల  పథకాలు, రైతులకు పంట సాగు విషయంలో తీసుకోవాల్సిన  జాగ్రత్తలు, మెలకువల పై అవగాహన కల్పిస్తారని. వాటి ద్వారా రైతులు పంట దిగుబడి అధికంగా పొందవచ్చని తెలిపారు.

అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు నందు ఎరువులు, పురుగుల మందులు అందుబాటులో ఉంటాయని, అదేవిధంగా రైతు పండించే ప్రతి పంట పంట నమోదు ద్వారా రైతు పథకాలను పొందవచ్చని, కావున ప్రతి రైతు పంట నమోదు తప్పక చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి సతీష్ బాబు, అగ్రి అడ్వైజరీ మెంబర్లు ఆదినారాయణ, పతాంజలి, పశువైద్యాధికారి ఉదయ్ కుమార్, హార్టికల్చర్ అధికారి రమణ, ఏ ఈ ఓ సునీత, రైతు భరోసా కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி