గొర్రెల యజమానులను ప్రభుత్వం ఆదుకోవాలి

662பார்த்தது
గొర్రెల యజమానులను ప్రభుత్వం ఆదుకోవాలి
అనంతపురం జిల్లా పుట్టపర్తి పట్టణం భారీ వర్షాలకు నల్లమడ మండలం చారుపల్లి లో కొట్టుకుపోయిన గొర్రెల యజమానులకు ఆర్థిక సహాయం అందించి ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం, సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని ప్రాంతీయ పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ రాముకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గొర్రెలను మేపు కుంటూ జీవిస్తున్న కాపరులు సుమారు 700 గొర్రెలు నష్టపోయారన్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే వారు కోలుకోలేరు అన్నారు. డాక్టర్ రాము మాట్లాడుతూ శాఖాపరంగా తగిన సహాయం అందించడానికి చర్యలు తీసుకొంటామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి రాము, సి ఐ టి యు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రామాంజనేయులు, గంగాద్రి, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி