శ్రీ సత్య సాయి జిల్లా పేరును హిందూపురం గా మారుస్తున్నారని వస్తున్న వార్తలను ప్రజలు నమ్మవద్దని టిడిపి హిందూపురం పార్లమెంట్ కార్యదర్శి సామకోటి ఆదినారాయణ మంగళవారం తెలిపారు. సీఎం చంద్రబాబుకు చెడ్డ పేరు తేవాలని ఆలోచనతో కొంతమంది చేస్తున్న కుట్ర అని పేర్కొన్నారు. సత్య సాయి బాబా పై సీఎంకు అమితమైన ప్రేమ ఉందని ప్రజలు ఆందోళన చెందవద్దని అన్నారు. జిల్లాను కాపాడుకునే బాధ్యత తమదని భరోసానిచ్చారు.