శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల 1వ తేదీనే వేతనాలు ఇవ్వాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ మైనుద్దీన్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ఆలస్యంగా జీతాలు ఇవ్వడం వల్ల ప్రతి నెల బ్యాంకులలో తీసుకున్న ఈఎంఐలు సకాలంలో చెల్లించలేకపోతున్నామన్నారు. ఫలితంగా వడ్డీల భారంతో అల్లాడిపోతున్నామన్నారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకపోయిందన్నారు. వివిధ దశల్లో జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తున్నామన్నారు. బ్యాంకర్లు అయినా మా పరిస్థితులు అర్థం చేసుకోవాలని పుట్టపర్తి ఎస్ బి ఐ మేనేజర్ రాంప్రసాద్ కు నాతోపాటు మున్సిపల్ ఉద్యోగుల రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహులు, ఆర్టీసీ ఉద్యోగుల జిల్లా కార్యదర్శి రమణ, ఎంప్లాయిస్ కార్యదర్శి ప్రసాద్, తదితరులు వినతి పత్రం సమర్పించామన్నారు.