కడప జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రిగా సవితమ్మను మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె బీసీ సంక్షేమం, చేనేత జౌళి శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇకపై ఆమె కడప జిల్లాకు ఇన్ చార్జ్ మంత్రి గానూ వ్యవహరిస్తారు. ఇందులో భాగంగా జిల్లాలో జరిగే ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సవిత పర్యవేక్షిస్తారు.