ఉచితంగా ఇసుకను అమలు చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘం నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం పెనుకొండ పట్టణంలో మంత్రి సవితమ్మకి జిల్లా కమిటీ సభ్యులు రవి అధ్యక్షతన వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్బంగా భవన నిర్మాణ కార్మిక సంఘం నియోజకవర్గ కన్వీనర్ కొండా వెంకటేశులు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు, భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు.