మడకశిర పట్టణంలోని రాజీవ్ గాంధీ సర్కిల్ వద్ద చెత్త దిబ్బలు కుప్పలుగా ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెత్త పేరుకుపోవడంతో దుర్వాసన రావడంతో మార్కెట్ వద్దకు వచ్చే వ్యాపారులు ప్రయాణికులు దోమలు ఎక్కువ అయ్యి వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి చెత్తను తొలగించాలని పట్టణ వాసులు, ప్రయాణికులు, వ్యాపారులు కోరుతున్నారు.