కళ్యాణదుర్గం పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో సోమవారం కనకదాసు 537వ జయంతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జి తలారి రంగయ్య, ఉమా మహేశ్వర నాయుడు తదితరులు పాల్గొని పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. కనకదాసు జీవిత విశేషాలను గురించి అక్కడికి వచ్చిన కురుబలకు వివరించారు. జై కురుబ నినాదాలతో ప్రాంగణం మార్మోగింది.