రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కదిరి నియోజకవర్గంలో పర్యటించారు. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తో కలిసి ఆదివారం అర్ధరాత్రి చెర్లోపల్లి రిజర్వాయర్ ను అధికా
రులతో కలిసి పరిశీలించారు. రిజర్వాయర్ లో మరమ్మతుల కోసం వెంటనే చేపట్టాల్సిన పనులు, ముళ్లకంపల తొలగింపు వంటి వాటిపై కలెక్టర్ కు సూచనలు చేశారు. వచ్చేనెల నుంచి హంద్రీనీవ కాలువల పనులు మొదలు పెట్టి, త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు.