శ్రీ సత్య సాయి జిల్లా, కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ ఢిల్లీ లోని గవర్నర్ కార్యాలయం లో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఏస్. అబ్దుల్ నజీర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర గవర్నర్ ను కలిసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. మిమ్మల్ని కలవడం చాలా ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, తదితరులు కందికుంట వెంట ఉన్నారు.